ఎస్ ఎల్ బిసీ ఆపరేషన్ గత 18 రోజులుగా కొనసాగుతూనే ఉంది. అయితే ఇవాళ ఈ ఆపరేషన్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ టన్నెల్లోకి… రోబోలను ప్రవేశపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు రెస్క్యూ టీమ్ అధికారిక ప్రకటన చేసినట్లు చెబుతున్నారు.
మొన్నటి నుంచి ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కంటిన్యూ అవుతోంది. సహాయక చర్యలు 18వ రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ టన్నెల్‌లోకి వెళ్లి అన్వీ రోబో బృందం వెళ్లనుంది. కార్మికుల ఆనవాళ్లు దొరకవచ్చని భావిస్తున్న ప్రాంతాలను… D1,D2 లుగా నిర్ధారించారు నిపుణులు.. D1 ప్రాంతం అత్యంత డేంజర్ జోన్‌గా సూచించారు నిపుణులు.