మట్టికుండలను మట్టితో తయారు చేస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాటికి మన కంటికి కనిపించని అతి సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దీని వల్ల కుండల్లో నీటిని పోయగానే ఆ నీరు కుండకు ఉన్న సూక్ష్మ రంధ్రాల్లోకి వెళ్తుంది.
ఎండాకాలంలో సహజంగానే మనం శీతల పానీయాలను తాగుతుంటాం. ఇక నీళ్ల విషయానికి వస్తే.. ఫ్రిజ్‌లో లేదా కుండల్లో నీటిని.. చల్లగా ఉంటేనే తాగుతాం. అవును మరి.. వేసవి తాపం అలా ఉంటుంది. అయితే ఫ్రిజ్‌లలో ఉంచిన నీళ్లు కాకుండా మట్టి కుండల్లో ఉంచిన నీటిని తాగితేనే మనకు మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది మట్టి కుండల్లోని నీటిని తాగేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే.. మట్టి కుండల్లోని నీరు చల్లగా ఉంటుంది కదా.. మరి అందులో పోసిన నీరు ఎలా చల్లగా అవుతుంది ? ఎప్పుడైనా ఆలోచించారా..? అయితే అది ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మట్టికుండలను మట్టితో తయారు చేస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాటికి మన కంటికి కనిపించని అతి సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దీని వల్ల కుండల్లో నీటిని పోయగానే ఆ నీరు కుండకు ఉన్న సూక్ష్మ రంధ్రాల్లోకి వెళ్తుంది. అయితే ఆ నీరు లోపల ఉన్న నీటి నుంచి వేడిని గ్రహించి బయటకు ఆవిరవుతుంది. ఆ సమయంలో కుండలో ఉన్న నీరు మళ్లీ సూక్ష్మ రంధ్రాల్లోకి వెళ్తుంది. అక్కడది లోపలి నీటి నుంచి వేడిని గ్రహించి బయటకు ఆవిరవుతుంది. ఇలా ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. దీంతో కుండల్లో ఉన్న నీరు క్రమంగా వేడి తగ్గిపోయి చల్లబడుతుంది. అలా కుండల్లో ఉండే నీరు చల్లగా మారుతుంది.
అయితే గ్లాసు, లోహం, ప్లాస్టిక్ తో తయారు చేయబడిన బిందెలకు, పాత్రలకు మట్టి కుండల్లా సూక్ష్మమైన రంధ్రాలు ఉండవు కనుక. వాటిల్లో ఎలా పోసిన నీరు అలాగే ఉంటుంది. ఇక మట్టి కుండల్లో నీరు చల్లగా మారే ప్రక్రియ సహజసిద్ధమైంది. అందుకనే ఫ్రిజ్ లోని చల్లని నీటి కన్నా కుండల్లోని చల్లని నీటినే తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. ఇప్పటికీ మన పెద్దలు మట్టి కుండల్లోని నీటినే తాగుతుంటారు.. కనుక ఇప్పటికైనా ఎవరైనా ఫ్రిజ్‌లలోని నీటిని తాగుతుంటే.. ఆ అలవాటుకు స్వస్తి చెప్పి కుండల్లో నీటిని తాగడం అలవాటు చేసుకోండి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు..!