ఏపీ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త..8 శాతం నుంచి 16 శాతానికి HRA పెంపు

-

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉద్యోగులకు, జగన్‌ సర్కార్‌ కు మధ్య పెద్ద యుద్దయే జరుగుతోంది. కొత్త పీఆర్సీ అమలు చేస్తే.. సమ్మెకు దిగుతామని ఏపీ ఉద్యోగులు చెబుతుంటే.. ఆ విషయంలో తాము అస్సలు తగ్గేదే లేదంటూ జగన్‌ సర్కార్‌ చెబుతోంది. దీంతో చేసేదేమీ లేక.. ఏపీ ఉద్యోగులు సమ్మె బాట పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 7 వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నారు ఏపీ ఉద్యోగులు.

ఆ నేపథ్యంలోనే తాజాగా ఏపీ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీ ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏ ను 8 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో హెచ్‌ఓడీ ఉద్యోగులు హెచ్‌ఆర్‌ఏ విషయంలో.. 8 శాతం ఉండే ప్రాంతాలలో ఉండటంతో తాజాగా ఏపీ సర్కార్‌ కొన్ని సవరణలు తీసుకువచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. జగన్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో.. ఏపీ ఉద్యోగులకు కాస్త ఊరట కలిగే చాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version