టీఎస్పీఎస్సీ స‌భ్యుల నియామ‌కం పిటిషన్‌పై హై కోర్టు విచార‌ణ

-

తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌ల టీఎస్ పీఎస్‌సీ క‌మిషన్ స‌భ్యుల‌ను నియ‌మించిన విషయం తెలిసిందే. కాగ ఈ నియ‌మకం పై గంద‌ర‌గోళం నెల‌కొంది. అర్హ‌త‌లు లేని వ్య‌క్తుల‌కు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిషన్ లో రాష్ట్ర ప్ర‌భుత్వం స‌భ్యులుగా నియ‌మించింద‌ని ప‌లువురు ఆరోపించారు. అంతే కాకుండా ప్రొఫెస‌ర్ వినాయక్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ హై కోర్టులో తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిషన్ స‌భ్యుల నియామ‌కంపై పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ప్రొఫెస‌ర్ వినాయక్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిషన్ ను విచారించ‌డానికి హై కోర్టు అంగీక‌రించింది.

అంతే కాకుండా.. తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిషన్ స‌భ్యుల నియామ‌కంపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వన్ని ఆదేశించింది. దీనికి ముందు పిటిషన‌ర్ ప్రొఫెస‌ర్ వినాయ‌క్ రెడ్డి త‌రపు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపిస్తూ.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం టీఎస్ పీఎస్సీ స‌భ్యుల నియ‌మకాన్ని చేప‌ట్టింద‌ని అన్నారు. కావాల్సిన అర్హ‌త‌లు లేకుండానే నియ‌మించార‌ని అన్నారు. అలాగే వీరి ప‌ద‌వీ కాలం మ‌రో ఐదు నెల‌లో ముగుయ‌నుంద‌ని హై కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ విచారించాల‌ని కోర్టును కోరారు. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసులో టీఎస్ పీఎస్సీ మాత్ర‌మే కౌంట‌ర్ దాఖ‌లు చేసింద‌ని అన్నారు. కానీ ప్ర‌భుత్వం దీనిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version