సినిమా మీద పాజిటివ్ బాగానే ఉన్నా సినిమాలో కామెడీ, రొమాన్స్ అన్నింటిని మించేసిన యాక్షన్ ఉందని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్ చేసినా అది ఒక్కటే ప్రేక్షకులను ఎంత వరకు థియేటర్లలో కూర్చో పెడుతుంది.. కేవలం యాక్షన్ పదే పదే థియేటర్లకు రప్పిస్తుందా ? అన్నది సందేహంగా ఉంది. యాక్షన్ సీన్లు కనెక్ట్ అయితే బాగానే ఉంటాయి.
అవే అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేవు. బాహుబలిలో యాక్షన్‌తో పాటు కావాల్సినంత డ్రామా, ఎమోషన్ ఉంది. సాహోలో అవి ఉండకపోతే సినిమా కేవలం యాక్షన్ మీద ఎంత వరకు నిలబడుతుంది ? అన్న డౌట్ ఉంది. ఎందుకంటే ప్రేక్షకుడి అభిరుచి మారింది. యాక్షన్ కన్నా ఎక్కువగా కామెడీ కి, కథకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
ప్రభాస్ కూడా చాలా ఇంటర్వ్యూల్లో యాక్షన్ అంటే ఫైట్స్ మాత్రమే కాదు…. కారు రేసులు, బైక్ రేసు లు కూడా కొత్తగా చూపించాం అంటూ చెప్పుకొస్తున్నాడు. అయితే ప్రభాస్ చెప్పినట్టుగా హాలీవుడ్ రేంజ్ లో సాహో ఫైట్స్ ఇంట్రెస్ట్ కలిగించేలా ఉన్నప్పటికీ యాక్షన్ మోతాదు మించితే అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ? అన్న ఆందోళన అందరికి ఉంది.