చిరంజీవి ‘ సైరా ‘ … ఫ్రీ… ఫ్రీ.. ఫ్రీ

-

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో సైరా నరసింహారెడ్డి ఓ మెమ‌ర‌బుల్ మూవీగా తెర‌కెక్కుతోంద‌న్న మాట నిజం. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తన కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ మూవీగా ఉండాలని ఈ సినిమా నిర్మాత, చిరు తనయుడు రామ్ చరణ్, చిరు ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం ఆలోచించకుండా భారీగా ఖర్చు పెట్టడంతో సైరాకు 270 కోట్ల ఖర్చు అయినట్టు తెలుస్తోంది.

Huge budget for Sye Raa Narasimha Reddy

ఇందులో చిరంజీవి రెమ్యున‌రేష‌న్‌ కూడా లేదట. సినిమాకు జరుగుతున్న బిజినెస్ చూస్తుంటే అంత మొత్తం రిక‌వ‌రీ అవుతుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. సినిమా ఎంత మార్కెట్ చేసినా… నాన్‌ థియేట్రికల్ రైట్స్ ఆదాయం కలుపుకున్నా కూడా జస్ట్ బ్రేక్ ఈవెన్ వరకు రావచ్చేమో అంటున్నారు. మరో భారీ బడ్జెట్ చిత్రం సాహోతో పోలిస్తే ఆ రేంజ్ రేట్ల‌కు అమ్ముడు అవ్వడం లేదు.

ఇది ఇలా ఉంటే మెగాస్టార్ రెమ్యున‌రేష‌న్‌ అంటే ఎంతలేదన్నా 25 నుంచి 30 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నాన్ థియేటర్ హక్కుల డీల్ ఇంకా సెటిల్ కాలేదు. అది ఫైనల్ అయితేనే అన్నీ కలిపి 270 కోట్లు రికవరీ వస్తుందో, రాదో తెలుస్తోంది. అటు చేసి…ఇటు చేసి రూ.270 కోట్లు వ‌చ్చినా అందులో చిరు రెమ్యున‌రేష‌న్ లేన‌ట్టే.

ఈ లెక్క‌న చిరు త‌న త‌న‌యుడి కోసం ఫ్రీగా సినిమా చేసిన‌ట్టు అనుకోవాలి. సినిమా బ‌డ్జెట్ ఎంత ? లాభ‌న‌ష్టాలు ఇవ‌న్నీ కాసేపు ప‌క్క‌న పెట్టేస్తే రామ్‌చ‌ర‌ణ్ మాత్రం త‌న తండ్రికి ఓ మెమ‌ర‌బుల్ గిఫ్ట్ ఇవ్వాల‌నుకున్నాడు ? ఈ నేప‌థ్యంలోనే సైరా లాంటి ప్రెస్టేజియ‌స్ మూవీ తీశాడు. మ‌రి సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో ? మాత్రం అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version