తూర్పుగోదావరి జిల్లాలో భారీ కుట్రను చేధించిన పోలీసులు !

-

తూర్పు గోదావరి జిల్లా పోలీసులు భారీ కుట్రను చేధించారు. సీతానగరం (మం) మునికూడలికి చెందిన శిరోమండనం కేసులో  బాధితుడు  ఇండుగుమిల్లి ప్రసాద్ అదృశ్యం అయిన సంగతి తెలిసిందే. మొన భర్త  కనిపించడం  లేదంటూ సీతానగరం పోలీస్ స్టేషన్ లో  భార్య ఐశ్వర్య  ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీతానగరం పోలీసులు పెద్ద కుట్రను చేధించారు. సీతానగరం శిరోముండనం బాధితుడు  ఇందుగుమిల్లి  ప్రసాద్  అదృశ్యం  కేసులో మిస్టరీ వీడింది.

ఈనెల 3వ తేదీన మునికూడలి  గ్రామం నుంచి  ప్రసాద్  అదృశ్యం  కావడం  ఉద్దేశపూర్వకం అని  పోలీసుల  దర్యాప్తులో  వెల్లడయింది. అజ్ఞాతంలో  ఉంటూ  సోషల్ మీడియా  ద్వారా  శాంతి  భద్రతలకు  విఘాతం  కలిగించాలని  శిరోమండనం బాధితుడు  ప్రసాద్ ప్లాన్  చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగా  మిస్సింగ్  అయిన  ప్రసాద్ తోపాటు సహకరించిన  మరో వ్యక్తిని  కాకినాడలో అరెస్టు చేసిన  రాజమండ్రి నార్త్ జోన్  పోలీసులు వారిని తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version