మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రముఖ విద్యా సంస్థ అయిన ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఆదివారం రాత్రి వేళ భారీ మొసలి కనిపించింది. నెమ్మదిగా మొసలి నడిచివస్తుండటం చూసి విద్యార్థులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గట్టిగా అరెస్తూ పరుగులు తీశారు. మరికొందరు విద్యార్థులు అక్కడే ఉండి వీడియోలు తీయడం ప్రారంభించారు.
అయితే, సమాచారం అందుకున్న పోలీసులు, జంతు ప్రేమికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.ఆ మొసలి వల్ల ఎవరికీ హానీ కలిగించకుండా చూసి సరస్సులో వదిలేశారు. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మొసలి సంచరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.