కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలో నిన్న రాత్రి భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది దాకా మరణించినట్లు చెబుతున్నారు. శివమొగ్గ సమీపంలోని అబాలేగెరే గ్రామంలో డైనమైట్ పేలిన ఘటనలో 8మంది మృతి చెందగా ఇప్పటికే చాలా మంది గాయపడ్డారు. క్వారీలో రాళ్ళు పేల్చేందుకు ఉపయోగించే పేలుడు పదార్థాలు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. ఈ దెబ్బకు వాహనం పూర్తిగా దెబ్బ తినగా దాదాపు ఈ ప్రకంపనల నాలుగు జిల్లాల దాకా వినిపించాయని అంటున్నారు.
పేలుడు నిన్న రాత్రి 10.20 ప్రాంతంలో చోటు చేసుకుంది. భారీ శబ్దాలు, ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ శబ్ద తీవ్రతకు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. భూకంపం అనే భయంతో జనం వీధుల్లోకి పరుగులు తీశారు. శివమొగ్గ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శివమొగ్గ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సొంత జిల్లా కావడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం ఆయన విచారణకు ఆదేశిచారు.