ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ని కలవనున్నారు. ఆయన కలవడానికి పెద్ద కారణమే ఉందని అంటున్నారు. ముఖ్యంగా గుంటూరు చిత్తూరు, కలెక్టర్ ల వ్యవహారం మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాలని గతంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇప్పుడు అమలు చేయకపోవడంతో ఆ విషయం మీద ఎన్నికల కమిషనర్ సీరియస్ గా ఉన్నారు అని అంటున్నారు. అందుకే ఈ రెండు జిల్లాల కలెక్టర్లతో కాకుండా ఆ రెండు జిల్లాలకు ఉన్న జాయింట్ కలెక్టర్లతో ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చర్చిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి ఈ కలెక్టర్లను బదిలీ చేయాలా వద్దా ? అనే దానిపై చర్చ జరుగుతోంది ఇదే విషయాన్ని మరో సారి ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈరోజు గవర్నర్ దృష్టికి కూడా ఎన్నికల కమిషనర్ ఇదే అంశాన్ని తీసుకువెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.