ఎక్కడో ఒక దగ్గర గ్లోబల్ మార్కెటింగ్ చైన్ సిస్టం వ్యాపారాలతో పలువురు మోస పోతున్నారు ఇటువంటి ఘటనలు మన ఎక్కువగా చూస్తున్నాం. పోలీసులు అప్రమత్తం చేసిన కొంతమంది యువతని మోసం చేయడానికి కొత్త స్కెచ్ వేస్తున్నారు. గ్లోబల్ మార్కెటింగ్ పేరు తో రూరల్ లో ఒక సంస్థ దారుణానికి పాల్పడినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మెహబూబ్ నగర్ జిల్లాకి చెందిన ఒక యువకుడు రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ సమీపంలో డ్రీమ్ టైలర్ గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీ సంస్థను ఏర్పాటు చేశారు.
నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఈ సంస్థని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఒక వ్యక్తి జాయిన్ అవ్వడానికి 3,500 చెల్లించి ఐదు రోజులు పాటు ట్రైనింగ్ అవ్వాలి ట్రైనింగ్ లో శిక్షణ ఇచ్చే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన వాళ్ళకి 50 వేలు చొప్పున చెల్లిస్తారని చెప్పి మోసం చేశారు 50000 చెల్లిస్తే 32000 విలువగల షర్ట్లు ప్యాంట్లు ఇస్తారని కూడా చెప్పారు. మార్కెటింగ్ చేయాలని దాని తర్వాత నూతనంగా ఎవరినైనా జాయిన్ చేస్తే వాళ్ళకి కూడా పారితోషకం ఉంటుందని ఇలాంటివారు 400 కి పైనే ఉన్నారు.