ప్రతి ఐదేళ్లకు ఒకసారి బీసీలను మోసం చేయటం చాలా సులభం అని నమ్మిన వ్యక్తి చంద్రబాబు. అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కలసి బీసీ డిక్లరేషన్ అని మరోసారి మోసపూరిత వాగ్దానాలు ప్రకటించారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఆశయాలు, లక్ష్యాలు అన్నీ ఆయనతోనే వెళ్లిపోయాయి. 1995 తరువాత ఎన్టీఆర్ అశయాలను ఒక అత్యాశపరుడు తుంగలోకి తొక్కాడు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి ఆయన ఆశయాలను విస్మరించి.. నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ, పేస్ట్ ప్రోగ్రాంను చంద్రబాబు ప్రదర్శించాడు.
బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు, టీడీపీకి లేదు. బీసీలను అతిఘోరంగా టీడీపీ మోసగించింది. 1995 నుంచి 2004లో వరకు బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులపై చంద్రబాబు ఏమైనా చేశారా అంటే ఏమీ లేదు. బీసీలు పేదరికం నుంచి ఎదగాలంటే.. విద్యమాత్రమే మార్గమని రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కానీ బీసీలను దగా చేసిన వారిలో ప్రప్రథముడు చంద్రబాబే. 2014లో బీసీల కోసం 142 హామీలు చంద్రబాబు ఇచ్చారు. జనం మర్చిపోయారని అనుకుంటున్నారేమో. ఒకవేళ చంద్రబాబు మర్చిపోయారేమో ఆ మేనిఫెస్టో తెప్పించుకుని చూడండి. 2014లో 142 హామీలు ఇస్తే.. ఒక్కటీ అమలు చేయలేదు.