టెట్ పరీక్ష ఫీజు భారీగా పెంపు !

-

రాష్ట్రంలోని నిరుద్యోగుల నడ్డి విరుస్తూ టెట్ ఫీజను ప్రభుత్వం పెంచేసింది. ఒక్కో పేపర్ కు ఫీజును రూ. 1000 గా నిర్ధారించింది. రెండు పేపర్లు రాయాలంటే రూ.2 వేలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.  ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు schooledu.telangana.gov.in వెబ్ సైట్ లో లాగిన్ అయి దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది.

టెట్ ను మే 20 నుంచి జూన్ a వరకు 15 రోజులపాటు ఆన్ లైన్ లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సర్వీస్ లో ఉపాధ్యాయులు కూడా ఈ టెట్  కు హాజరయ్యే వెసులుబాటు  కల్పిస్తున్నది. డీఈడీ పూర్తి చేసిన వారు మాత్రమే  టెట్ పేపర్-1కి అర్హులు. పేపర్ 2కి డిగ్రీ  బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం ఇతరులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 2015 లోపు అయితే జనరల్ 50 శాతం, ఇతరులకు 40 శాతం ఉన్న వారు కూడా అర్హులే అని ప్రకటించింది. మరోవైపు నిరుద్యోగులు ఫీజును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫీజు ఉండదని చెప్పి.. ఇప్పుడు భారీగా ఫీజు వసూలు చేయడం ఏంటి..? ప్రశ్నిస్తున్నారు టెట్ అభ్యర్థులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version