న్యూఇయర్ స్పెషల్ .. భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

-

న్యూ ఇయర్ సంధర్భంగా చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మందుబాబులు భారీగా పట్టుబడ్డారు.  నిన్న ఒక్కరోజే 931 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. గచ్చిబౌలి 201, మాదాపూర్ 171, కూకట్‌పల్లి 167, మియాపూర్ 93, జీడిమెట్ల 72, రాజేంద్రనగర్ 53, అల్వాల్ 47, బాలానగర్ 45, శంషాబాద్ 42, షాద్‌నగర్ 40 కేసులు నమోదయ్యాయి. 

పట్టుబడ్డ 931 మందిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. 721 బైక్‌లు, 190 ఫోర్‌ వీలర్లు, 18 ఆటోలు, 2 హెవీ వెహికల్స్ సీజ్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారిలో 271 మంది 25 ఏళ్ల లోపు వారేనని పోలీసులు గుర్తించారు. 35 ఏళ్ల లోపు 452 మంది ఉన్నారు, బ్రీత్ ఎనలైజర్‌ టెస్ట్‌లో 500 పాయింట్లు చూపిన కేసులు 7 దాకా ఉన్నాయి. పట్టుబడిన వారికి  కౌన్సిలింగ్ నిర్వహించి వారిని కోర్టులో హాజరు పరచనున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు,

Read more RELATED
Recommended to you

Latest news