వన్ ప్లస్ డివైజ్లపై భారీ ఆఫర్లు…!

-

వన్ ప్లస్ ఫోన్ కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు శుభవార్త. ఇంకొన్ని గంటల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ మొదలవుతోంది. దీనిలో వన్ ప్లస్ డివైజ్లపై భారీ ఆఫర్లు ప్రకటించారు. కనుక ఈ ఆఫర్ ని వినియోగించుకుని డబ్బులు ఆదా చేసుకోండి. అక్టోబరు 3 నుంచి ప్రారంభం కానున్న ఈ ఆఫర్ల జాతరలో.. చాలా కంపెనీలు తమ ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించాయి.

స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ కూడా వివిధ మోడళ్లపై ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపింది. ఇక పూర్తిగా చూస్తే.. వన్‌ప్లస్‌ 9 ప్రో 5జీ రిటైల్ ధరను సంస్థ రూ.57,999గా నిర్దేశించింది. 8 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఈ ధరకు పొందొచ్చు. మార్నింగ్ మిస్ట్, పైన్ గ్రీన్, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వన్‌ప్లస్‌ 9 5జీ స్మార్ట్‌ఫోన్‌ బేస్ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.39,999కు అందజేస్తుంది. దీంతోపాటు వన్‌ప్లస్‌ 9ఆర్ 5జీ ఫోన్ ధరను భారీగా తగ్గించింది. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌లో భాగంగా రూ.39,999 ధర ఉండే ఈ ఫోన్‌ను రూ.34,999కు అందిస్తుంది.

గతేడాది నుంచి వన్‌ప్లస్‌ 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 35,499కు అందిస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్ 2 5జీ, నార్డ్ సీఈ 5జీ ఫోన్ల ధరను కంపెనీ తగ్గించలేదు. కానీ వినియోగదారులకు బ్యాంక్ ఆఫర్లను ప్రకటించింది. కనుక వాటి ద్వారా మీరు మీ డబ్బులని సేవ్ చేసుకోండి. అలానే వన్‌ ప్లస్‌ బడ్స్ ప్రో టీడబ్ల్యూఎస్ మైక్రో ఫోన్లు ప్రస్తుతం రూ.9,999కు అందుబాటులో ఉండగా సేల్ లో వన్‌ప్లస్‌ బడ్స్ జెడ్(రూ.2,999), వన్‌ప్లస్‌ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ సిరీస్(రూ.1,999), 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్(రూ.1,299) పై డిస్కౌంట్లను ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news