దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఈరోజు దేశం లో 24,354 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో 14,29,258 కరోనా పరీక్షలు చేసినట్లు ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ. దీంతో కరోనా మహమ్మారి పరీక్షల సంఖ్య 57,19,94,990 కు చేరింది.
ఇక అటు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33, 791, 061 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,73,88 కు చేరింది. 197 రోజుల తర్వాత… యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గడం గమనార్హం. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.09 శాతంగా ఉంది.
ఇక దేశంలో తాజాగా 234 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4, 48, 373 కి చేరింది. కాగా.. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయ వంతంగా కొన సాగుతోంది. ఇప్పటికే 89 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేసింది కేంద్ర ఆరోగ్య సంస్థ. డిసెంబర్ నాటికి పూర్తి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తోంది సర్కార్.