భారీ వర్షానికి ఫలక్‌నుమా బ్రిడ్జికి పెద్ద గుంతపడింది. ఆరు అడుగుల గొయ్యి పడడంతో… అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జిపైకి వాహనాలను అనుమతించడం లేదు. ఫలక్‌నుమా-చంద్రాయణగుట్ట మార్గంలో ప్రయాణించే వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. శాలిబండ, లాల్‌దర్వాజ, చత్రినాక, కందికల్ గేట్ ఫ్లైఓవర్, పూల్‌బాగ్ ప్రాంతాల మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు.
ఫలక్ నుమా బ్రిడ్జ్ పై ప్రమాద స్థాయి లో గొయ్యి పడడంతో బారిగేట్లు పెట్టి పబ్లిక్ అటువైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. హైదరాబాద్ లో కేవలం సౌత్ జోన్ , ఈస్ట్ జోన్ మినహా అన్ని ప్రాంతాల్లో యధావిధిగా ట్రాఫిక్ నడుస్తుందని తెలిపారు పోలీస్ అధికారులు.