శ్యాం సింగ‌రాయ్ కోసం భారీ సెట్‌.. అంత ఖ‌ర్చు చేస్తున్నారా!

-

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన ఏ సినిమా అయినా మినిమమ్ హిట్ గ్యారంటీ. ఆయ‌న సినిమా అంటే చాలా మంది ఆయ‌న న‌ట‌న గురించే ఎదురు చూస్తారు. ఎవ‌రి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు నాని. ఇక ఆయ‌న న‌టిస్తున్న శ్యామ్ సింగ‌రాయ్ గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ట్యాక్సీ వాలా ఫేం రాహుల్‌సంకీర్త్యన్ ద‌ర్శ‌క‌త్వంలో శ్యాం సింగ‌రాయ్ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. హైద‌రాబాద్‌లో వేసిన స్పెష‌ల్ సెట్ లో ప్ర‌స్తుతం షూటింగ్ చేస్తున్నారు మూవీ బృందం. అయితే ఈ సెట్ కోసం మేక‌ర్స్ పెట్టిన ఖ‌ర్చు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. శ్యామ్ సింగరాయ్ కోసం నిర్మాత‌లు కోల్‌క‌తా బ్యాక్ డ్రాప్ తో రూ.6.5 కోట్లతో భారీ సెట్ వేశార‌ని తెలుస్తోంది. మొత్తం 10 ఎకరాల్లో ఈ సెట్ వేసిన‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.

ఆర్ట్ డైరెక్ట‌ర్ అవినాష్ కొల్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ భారీ సెట్ వేశార‌ట‌. ఈ సెట్‌లో లీడ్ తారాగ‌ణంపై వ‌చ్చే కీల‌క స‌న్నివేశాల‌ను రాహుల్ సంకీర్త్య‌న్ తెర‌కెక్కిస్తున్నాడు. సినిమా విజువ‌ల్ ఫీస్ట్ గా ఉండేందుకు నిర్మాత వెంక‌ట్ బోయ‌నప‌ల్లి భారీగానే ఖ‌ర్చు చేస్తున్నాడ‌ని స‌మాచారం. ఇక మూవీలో ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల‌కు భారీ స్పంద‌న వ‌స్తోంది. స‌రికొత్త గెట‌ప్ లో నాని మెస్మ‌రైజ్ చేయ‌న‌న్న‌ట్టు మూవీ టీం చెబుతోంది. నాని ఏ రేంజ్‌లో హిట్ అందుకుంటాడో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version