టీడీపీ నేతలను చీపుర్లు, చెప్పులతో కడతారు – బొత్స సంచలనం

-

టీడీపీ నేతలను చీపుర్లు, చెప్పులతో కడతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య. విజయనగరం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన … చంద్రముఖి పాలనలా సాగుతుందని చురకలు అంటించారు. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న … రాష్ట్ర అబివృద్ది జరగలేదని ఫైర్ అయ్యారు.

Gajapatinagaram YSRCP dormer MLA Botcha Appalanarasayya comments on tdp

టిడిపి నాయకులు కండువా వేసుకొని గ్రామాల్లోకి వెళ్తే మహిళలు చీపుర్లతోను … మగవాల్లు చెప్పులతోను … కొడతారని వార్నింగ్‌ ఇచ్చారు. మొదటి సంతకం మెగా డిఎస్సి పై పెట్టారు … కానీ … మెగా డిఎస్సీ జాడలేదని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో భూదోపిడి చేస్తున్నారని మండిపడ్డారు. బినామీ పేర్లు తో భారీ ఎత్తున భూ దోపిడి జరుగుతుందని ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్శయ్య.

Read more RELATED
Recommended to you

Latest news