ప్రియుడితో భార్య.. అంతలో తలుపు తీసిన భర్త.. చివరికి..?

అంత సాఫీగా సాగిపోతున్న దాంపత్య జీవితం లోకి మూడో వ్యక్తి రావడంతో అసలు కథ మొదలవుతుంది. దీంతో అక్రమ సంబంధాల నెపంతో జరుగుతున్న దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా కట్టుకున్న వారిని దారుణంగా కడ తెరుస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి దారుణం వెలుగులోకి వచ్చింది.

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడిని దారుణంగా హత్యచేశాడు ఇక్కడ ఒక వ్యక్తి. స్థానికంగా కలకలం సృష్టించింది ఈ ఘటన. నిజాంబాద్ నగరంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నిజాంబాద్ నగరంలోని ఆర్య నగర్ లో ఓ వ్యక్తి వాచ్మెన్ గా పనిచేస్తూ భార్యతో కలిసి నివాసముంటున్నాడు.. ఈ క్రమంలోనే అంత సాఫీగా సాగిపోతుంది అనుకున్న తరుణంలో సమీపంలో ప్లంబర్ గా పనిచేస్తున్న రాజు అనే యువకుడితో వాచ్మెన్ భార్యకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. ఇక ఇటీవల రాత్రి సమయంలో డ్యూటీకి వెళ్లిన భర్త పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి భార్య ప్రియుడితో ఏకాంతంగా ఉండటం తో కోపంతో ఊగిపోయిన భర్త.. రాజు పై రాడ్డుతో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.