ఎవరి ‘కథ’ వాళ్ళది…కానీ హుజూరాబాద్‌లో ఇదే అసలు ‘కథ’..

-

హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అసలు ఈటల రాజేందర్ ఎప్పుడైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో అప్పటినుంచి హుజూరాబాద్‌ రాజకీయం వేడెక్కింది. ఎవరికి వారు తమదైన శైలిలో వ్యూహాలు వేసుకుంటూ, ప్రత్యర్ధులని చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార టి‌ఆర్‌ఎస్…తన అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించుకుందో కూడా చూశాం.

Huzurabad | హుజురాబాద్

అయితే మధ్యలో ఉపఎన్నికకు కాస్త బ్రేక్ వచ్చింది. కానీ ఇటీవలే ఉపఎన్నిక షెడ్యూల్ రావడంతో హుజూరాబాద్ పాలిటిక్స్ వాడివేడిగా నడుస్తున్నాయి. అలాగే ప్రధాన పార్టీల అభ్యర్ధులు కూడా ఖరారు అయిపోయారు. బి‌జే‌పి నుంచి ఈటల రాజేందర్, టి‌ఆర్‌ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్‌లు బరిలో దిగుతున్నారు. అయితే ఇక్కడ మూడు పార్టీలు తమదైన శైలిలో రాజకీయం చేయడం మొదలుపెట్టాయి.

ఈటలకు పరోక్షంగా కాంగ్రెస్ సాయం చేస్తుందని టి‌ఆర్‌ఎస్ అంటుంది…అసలు బి‌జే‌పి-టి‌ఆర్‌ఎస్‌లు ఒక్కటే అని కాంగ్రెస్ మాట్లాడుతుంది. టి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్‌లు కలిసి రాజకీయం చేస్తున్నాయని బి‌జే‌పి విమర్శిస్తుంది. ఇలా ఎవరికి వారు విమర్శలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో రాజకీయం ఎలా నడుస్తుందనే విషయాన్ని కాసేపు పక్కనబెడితే….హుజూరాబాద్‌లో ఈటలని ఓడించడానికి టి‌ఆర్‌ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ ప్రయత్నాలు చేస్తుంది. అదే సమయంలో ఇక్కడ బి‌జే‌పికి అంతా సీన్ లేదు. కేవలం ఈటల తన సొంత ఇమేజ్ మీద ఆధారపడి బండి నడిపిస్తున్నారు. అందుకే న్యూట్రల్ వ్యక్తులు కూడా ఈటలకే మద్ధతు ఇస్తున్నారు. అలాగే కాంగ్రెస్ కూడా ఈటలకు మేలు చేసేలా పనిచేస్తుందని, అందుకే వీక్ అభ్యర్ధిని పెట్టిందనే చర్చ కూడా నడుస్తోంది. ఎక్కువ ఓట్లు చీలిపోయి టి‌ఆర్‌ఎస్‌కు బెనిఫిట్ జరగకుండా, ఈటలకు నష్టం జరగకుండా రాజకీయం నడుస్తోందని చర్చ వస్తుంది.

అయితే హుజూరాబాద్‌లో రాజకీయాలకు అతీతంగా ఫైట్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. అధికార టి‌ఆర్‌ఎస్‌ని మట్టబెట్టడానికి అన్నీ వర్గాలు ఈటలకు మద్ధతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి హుజూరాబాద్ పోరులో చివరికి ఎవరిది పైచేయి అవుతుందో?

 

Read more RELATED
Recommended to you

Exit mobile version