బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం క్రమంగా బలహీనబడుతోంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 1.5 కిలోమీటర్ల మేరకు వ్యాపించిన ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ తో తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని అన్ని పోర్టుల వద్ద మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు.
మత్య్సకారులు ఎవరు సముద్రంలో వేటకు వెళ్ల కూడదని అధికారులు సూచించారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం ఆఫీసర్ సుధావల్లి పేర్కొన్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నట్టు తెలిపారు.