హుజూరాబాద్ వార్: ఆ రెండు మండలాల్లో టఫ్ ఫైట్ ఉంటుందా?

-

హుజూరాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ పార్టీలో టెన్షన్ పెరిగిపోతుంది…పోలింగ్‌కు కొన్ని గంటలే సమయమే ఉండటంతో ఎవరికి వారు…శక్తివంచన లేకుండా ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారం ద్వారా ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం చేశారు..ఇప్పుడు ప్రలోభాల ద్వారా ఓటర్లని తమవైపుకు తిప్పుకోవడానికి చూస్తున్నారు. అయితే హుజూరాబాద్ పోరు…కేవలం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా జరుగుతున్న విషయం తెలిసిందే.

Huzurabad | హుజురాబాద్

ఈ పోరులో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కానుందని అందరికీ క్లారిటీ వచ్చేసింది…అంటే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లు ఫైట్ నడుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ ఈటలని దెబ్బతీయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో అందరికీ తెలిసిందే. ఇటు ఈటల సైతం టీఆర్ఎస్‌ ప్రయత్నాలకు ఎక్కడకక్కడ చెక్ పెట్టుకుంటూ వస్తూ…తనపై ప్రజలకు ఉన్న అభిమానం మీద నమ్మకంతో ముందుకెళుతున్నారు.

అయితే ఈటల ఎప్పుడైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో అప్పటినుంచే హుజూరాబాద్ పోరు షురూ అయింది. ఇక అప్పటినుంచి హుజూరాబాద్‌లో రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారిపోతూ వచ్చాయి. అలాగే నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో రాజకీయం ఊహించని మలుపులు తిరిగింది. మొదట్లో ఐదు మండలాల్లో ఈటలకే ఎడ్జ్ ఉందని ప్రచారం నడిచింది. కానీ రాను రాను ఆ ఎడ్జ్ మారుతూ వచ్చిందని తెలుస్తోంది.

ఇప్పటికే రెండు మండలాల్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నడిచే మండలాలు వచ్చి.. హుజూరాబాద్, వీణవంక మండలాలు. ఈ రెండుచోట్ల టీఆర్ఎస్-బీజేపీల మధ్య నువ్వా-నేనా అన్నట్లు ఫైట్ నడిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక కమలాపూర్ మండలంలో బీజేపీకి ఫుల్ ఎడ్జ్ ఉందని తెలుస్తోంది. ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో బీజేపీకి కాస్త ఎడ్జ్ ఉంది గానీ, టీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో బీజేపీకే కాస్త మొగ్గు ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఎన్నికల సమయానికి ఈ సమీకరణాలు ఇంకా ఎలా మారుతాయో?

Read more RELATED
Recommended to you

Exit mobile version