హుజూరాబాద్ నియోజకవర్గంలో గెలుపు దిశగా బీజేపీ ప్రయాణిస్తోంది. తాజా ముగిసిన 13 వ రౌండ్ తర్వాత బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కి 8388 ఓట్ల ఆధిక్యం లభించింది. కాగా ఫలితాల సరళిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. హూజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హెం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై అభినందనలు తెలియజేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు , కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వల్లే బీజేపీ గెలిచిందని బండి సంజయ్, అమిత్ షాకు వివరించినట్లు తెలుస్తోంది.
మరో వైపు బీజేపీ 13వ రౌండ్ ముగిసింది. మరో 9 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు జరిగిన 13 రౌండ్ల కౌంటింగ్ లో బీజేపీ హవా కనిపిస్తోంది. కేవలం రెండు రౌండ్లలోనే టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యతను ప్రదర్శించింది.