Samantha Ruth Prabhu: “నేను పర్‌ఫెక్ట్‌ కాదు.. కానీ ఎప్పటికీ వెనకడుగు వేయను”.. ఆసక్తికరంగా సమంత పోస్ట్

-

Samantha Ruth Prabhu: నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత.. త‌న లైఫ్ స్టైల్ లో మార్పు వ‌చ్చింది. త‌న జీవితంలోని చిన్న చిన్న విష‌యాల‌ను, త‌న అభిప్రాయాలను, ఇష్టాలను ఆస‌క్తికరంగా సోష‌ల్ మీడియాలో తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. అలాగే ఈ రోజూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రాం వేదిక‌గా ‘అమ్మ చెప్పింది’ అంటూ రాసుకొచ్చింది.

‘‘నేను బ‌ల‌వంతురాలిని.. నేను దేనినైనా భరిస్తాను.. నేను పర్‌ఫెక్ట్‌ కాదు.. కానీ ఎప్పటికీ వెనకడుగు వేయను.. ప్రేమ, దయ ఉన్న‌దాన్ని.. దృఢ నిశ్చయురాలిని.. నేను మనిషిని.. నేను యోధురాలిని..’’ అని అమ్మచెప్పింది అంటూ సమంత పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇక కెరీర్‌ పరంగా సమంత వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే శాకుంత‌లం, కాతువాకుల రెండు కాదల్‌’ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్దంగా ఉన్నాయి. ఇదే త‌రుణంలో వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ లో అడుగులు వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు టాక్. అలాగే… ‘డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌’, శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌లో రెండు సినిమాల చేసేందుకు ఒప్పుకొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version