హుజూరాబాద్ లో కేసీఆర్ సభ పెట్టకుండా బీజేపీ కుట్ర చేసిందని హరీష్ రావు దుయ్యబట్టారు. గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయం కావడంతో బీజేపీ కొత్త కుట్రలు పన్నుతుందని ఆయన విమర్శించారు. ఉప ఎన్నికల సర్వేలన్నీ టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని, 2001 నుంచి ఈ ప్రాంత ప్రజలు కేసీఆర్ ను ఆదరిస్తూ వస్తున్నారని హరీష్ రావు అన్నారు. బీజేపీ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడకుండా, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరల గురించి మాట్లాడం లేదు, కనీసం భవిష్యత్తులో ధరలు పెరగవనే హామీ కూడా ఇవ్వడం లేదని బీజేపీని ఎద్దేవా చేశారు.
హుజూరాబాద్ లో కేసీఆర్ సభ పెట్టకుండా బీజేపీ కుట్ర చేసింది- హరీష్ రావు
-