భారీ విజయం దిశగా ఈటెల రాజేందర్.. 22 వేల కన్నా అధిక మెజారిటీ ఖాయం

-

దేశవ్యాప్తంగా అందరి ద్రుష్టిని ఆకర్షించిప హుజూరాబాద్ ఎన్నికల్లో భారీ విజయం దిశగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వెళ్తున్నారు. ఉదయం నుంచి మొదలైన బీజేపీ హవా ఎక్కడా తగ్గకుండా లీడ్ ను కనబరుస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగలింది. ప్రభుత్వ పథకాలు, లీడర్ల ప్రచారం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు తీరాలకు చేర్చలేకపోయింది.

తాజాగా ముగిసిన 19వ రౌండ్ లో కూడా బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు అద్భుత లీడ్ ను సాధించారు. ఈ రౌండ్ లో ఏకంగా 3047 ఓట్ల ఆధిక్యతను కనబరిచారు. 19 రౌండ్ కు చేరే సరికి మొత్తం మెజారిటీ 19541 ఓట్లకు చేరింది. మరో మూడు రౌండ్లు ముగిసే సరికి ఈటెల రాజేందర్ కు దాదాపుగా 22 వేల నుంచి 25 వేల వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 19వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థికి 91312 ఓట్లు రాగా… టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 71771 ఓట్లు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version