Akanda : దీపావళి కానుక ఇచ్చేసిన బాలయ్య

-

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్లో హైట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా అఖండ. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక శ్రీకాంత్, జగపతి బాబు మరియు పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మిరియాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి కాగా… విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలోనే బాలయ్య నటించిన అఖండ సినిమా నుంచి తాజాగా ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. అఖండ సినిమా టీజర్ ను ఈ దీపావళి కానుకగా అంటే నవంబర్ 4వ తేదీన… ఉదయం 11:43 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

అలాగే నవంబర్ 8 వ తేదీన ఈ సినిమా నుంచి లిరికల్ వీడియోను విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించింది చిత్రబృందం. దీపావళి కానుకగా ఈ రెండు అప్డేట్లు అందిస్తున్నట్లు ఓ పోస్టర్ ను కూడా వదిలింది అఖండ టీం. ఇక ఈ తాజా అప్డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. కాగా అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version