హుజూరాబాద్ సర్వే: కేసీఆర్‌ కన్ఫ్యూజ్ చేస్తున్నారా?

-

హుజూరాబాద్‌ ఎవరు గెలుస్తారు? అనే విషయంపై అనేక రకాల సర్వేలు బయటకొస్తున్న విషయం తెలిసిందే. పార్టీలు వారీగా సర్వేలు వస్తున్నాయి….థర్డ్ పార్టీ సర్వేలు కూడా వస్తున్నాయి. అయితే ఎవరికి వారు గెలుపు తమదంటే తమదని చెప్పుకుంటున్నారు. అధికార టి‌ఆర్‌ఎస్ ఏమో హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమైపోయిందని చెబుతుంది. అటు ఈటల రాజేందర్ గెలుపు నల్లేరు మీద నడకే అని బి‌జే‌పి మాట్లాడుతుంది.

KCR-TRS

అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ సర్వేలు ఉన్నాయి. కాకపోతే ఇతర సంస్థలు చేసే సర్వేల్లో హుజూరాబాద్‌లో ప్రజల మొగ్గు ఎక్కువగా ఈటల వైపే ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో సి‌ఎం కే‌సి‌ఆర్ తనదైన స్ట్రాటజీలని ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా తమ పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు పార్టీ బీఫామ్‌ ఇచ్చారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరఫున రూ.28 లక్షల చెక్కును కూడా అందించారు.

ఈ క్రమంలోనే గెలుపుపై గెల్లుకు కే‌సి‌ఆర్ అభయహస్తం ఇచ్చారు….తన దగ్గర అన్నీ సర్వే రిపోర్టులు ఉన్నాయని, అన్నీ నీకే అనుకూలంగా వచ్చాయని గెల్లుకు చెప్పారు. అలాగే మంచి మెజారిటీతో గెలుస్తావని, ప్రజలకు అందుబాటులో ఉండాలని గెల్లుకు కే‌సి‌ఆర్ సూచించారు. అంటే హుజూరాబాద్‌లో సర్వేలు అన్నీ గెల్లుకే అనుకూలంగా ఉన్నాయని కే‌సి‌ఆర్ చెబుతున్నారు. అయితే ఆ సర్వేలు ఏంటి అనేవి ఎవరికి తెలియదు. అంటే ఓ స్ట్రాటజీ ప్రకారం సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి కే‌సి‌ఆర్….ప్రత్యర్ధిని కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

పైగా సర్వేలు అన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని ఓటర్లని కూడా తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇంకా సర్వేలు టి‌ఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయనుకుంటే….ఓటర్ల మైండ్ సెట్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది….వాళ్ళు కూడా చేంజ్ అయ్యి టి‌ఆర్‌ఎస్ వైపుకు వస్తారనేది కే‌సి‌ఆర్ స్ట్రాటజీగా తెలుస్తోంది. మరి కే‌సి‌ఆర్ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version