Hyd : హారన్ కొట్టాడని.. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ దాడి చేసాడు. హైదరాబాద్-మెహదీపట్నం రైతుబజార్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆటో డ్రైవర్ సైడ్ ఇవ్వకపోవడంతో బస్సు డ్రైవర్… హారన్ కొట్టాడు.

దీంతో ఆగ్రహానికి గురైన ఆటో డ్రైవర్.. బస్సు వద్దకు వెళ్లి డ్రైవర్ సీటు కిటికీ పట్టుకుని బూతులతో వీరంగం సృష్టించాడు. అంతటితో ఆగకుండా బస్సు ఎక్కి మరీ అతడిపై దాడి చేసాడు. ఇక ఈ సంఘటనకు సంబందించిన వీడియో వైరల్ గా మారింది. ఆ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని మెహదీపట్నం సీఐ వివరణ ఇచ్చారు.
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన ఆటో డ్రైవర్
మాసబ్ ట్యాంక్ నుంచి మెహిదీపట్నం వరకు బస్సును వెంబడించి మరీ దాడి
తన ఆటోను బస్సుతో ఢీకొట్టాడంటూ దాడి చేసిన ఆటో డ్రైవర్ pic.twitter.com/MpAHCyOAc6
— Telugu Scribe (@TeluguScribe) August 18, 2025