మైక్రోసాఫ్ట్ లో జాబ్ సాధించిన హైదరాబాద్ అమ్మాయి.. సంవత్సరానికి 2కోట్ల జీతం..

-

అమెరికా.. ఇంజనీరింగ్ చదువుతున్న వారి కలల దేశం. బీటెక్ అయిపోగానే ఎంట్రన్స్ రాసి వీసా తెచ్చేసుకుని అమెరికా వెళ్ళిపోయి చదువు పూర్తి చేసుకుని ఎవ్వరికీ అందనంత సాలరీ తెచ్చుకోవాలని ఆరాటపడుతుంటారు. కానీ కొందరే అది సాధిస్తారు. తాజగా హైదరాబాద్ కి చెందిన నార్కుటి దీప్తి ఆ విజయాన్ని సాధించింది. సంవత్సరానికి 2కోట్ల వేతనంతో మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం తెచ్చుకుంది. ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎమ్మెస్ చేసిన దీప్తి క్యాంపస్ ఇంటర్వ్యూలో భాగంగా ఉద్యోగం సంపాదించింది.

యూనివర్సిటీ నుండి మొత్తం 300మంది సెలెక్ట్ అయితే అందులో అత్యధిక వేతనం దీప్తికే కావడం గుర్తించాల్సిన విషయం. అమెజాన్, గోల్డ్ మాన్ సాచ్ కంపెనీలకి పనిచేయమని అవకాశం వచ్చినప్పటికీ మైక్రోసాఫ్ట్ కంపెనీనే ఎంచుకుంది. సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ మేనేజర్ గా గ్రేడ్ 2 ఉద్యోగాన్ని దీప్తి సాధించింది. దీప్తి నాన్నగారు వెంకన్న, హైదరాబాద్ లో ఫోరెన్సిక్ నిపుణుడిగా పనిచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version