పీఎం కిసాన్ డబ్బులు రాలేదా..? అయితే ఇలా ఫిర్యాదు చేయండి!

-

కేంద్ర ప్రభుత్వం అనేక రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. వాటిల్లో రైతుల కోసం తీసుకొచ్చిన పీఎం కిసాన్ కూడా ఒకటి. ఈ స్కీమ్ వలన చాల మంది రైతులకి డబ్బులు వస్తున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్ కింద 8వ విడత డబ్బులను అన్నదాతల అకౌంట్లలో జమ చేసింది.

రూ.2 వేలు రైతులకు అందించింది. అయితే ఒకవేళ ఆ డబ్బులు అందలేదు అంటే ఏం చెయ్యాలి అనేది చూద్దాం. మీకు కనుక పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రాలేదు అంటే కంప్లైంట్ పెట్టచ్చు. ఇక వాటి కోసం చూస్తే… హెల్ప్ లైన్ నెంబర్లక కాల్ చేయొచ్చు లేదా ఏరియా అగ్రికల్చర్ ఆఫీసర్‌కు సంప్రదించొచ్చు.

కొంత మందికి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, పేర్లలో తప్పులు ఉండటం వల్ల పీఎం కిసాన్ డబ్బులు రాకపోవచ్చు. ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. డబ్బులు రాని వారు 011-24300606, 011-23381092 నెంబర్లకు కాల్ చేయొచ్చు.

ఈ నెంబర్లు మాత్రమే కాకుండా పీఎం కిసాన్ హెల్ప్ లైన్ డెస్క్‌కు pmkisan-ict@gov.in ఈమెయిల్ పంపొచ్చు. దీనితో పరిష్కారం వస్తుంది. ఇలా డబ్బులు అందలేని వారు చెయ్యండి ఇక సమస్య ఉండదు. కాగా ఈ స్కీమ్ కింద డబ్బుల్ని మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version