Hyderabad: హైదరాబాద్ అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది – రేవంత్ రెడ్డి

-

సోమవారం సాయంత్రం నాంపల్లి మైదానంలో నుమాయిష్ ఆరంభమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటేనే ట్యాంక్బండ్, చార్మినార్,నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకు వస్తాయని అన్నారు. నుమాయిష్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న వ్యాపారవేత్తలు పాల్గొంటారని అన్నారు . వివిధ కళలకు సంబంధించిన వస్తువులు నుమాయిష్ లో ప్రదర్శించడం ఎంతో అభినందనీయం అని అన్నారు.ఈ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ ఎగ్జిబిషన్ కమిటీలో మహిళల ప్రాతినిధ్యం ఎంతో అభినందనీయమని అన్నారు.

ఎన్నో సంవత్సరాలుగా పారిశ్రామికవేత్తలు,ఇంజినీర్లు, డాక్టర్లు, పలు సంస్థల యజమానులు కలిసి నుమాయిష్ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నుమాయిష్ మన రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తుందన్నారు. దీనికి సంబంధించిన విద్యాసంస్థల్లో 30వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, దశాబ్దాలుగా ఎంతో మంది వ్యాపారవేత్తలను తయారు చేసిందని ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ ను గెలిపించారని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మార్పులు తీసుకొస్తామని శ్రీధర్ బాబు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version