బ్రేకింగ్ : హైదరాబాద్ లో రోడ్డెక్కనున్న 25 శాతం సిటీ బస్సులు

-

తెలంగాణా ప్రభుత్వం ఈరోజు ప్రయాణికులకి వరుస గుడ్ న్యూస్ లు అందించింది. ఈరోజు కొద్ది సేపటి క్రితం అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ కాకుండా పొరుగు రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర, కర్ణాటకలకి బస్సులు నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లోని సిటీ బస్సులకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా వైరస్ లాక్ డౌన్ విధించిన నాడు గ్రేటర్ లో నిలిచిపోయిన ఆర్టీసి బస్సులు తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నా సిటీలో మాత్రం ఇప్పటికీ కూడా రోడ్ ఎక్కలేదు. ఇక తాజాగా రేపటి నుంచి హైదరాబాద్ సిటీ బస్సులు నడపడానికి కేసీఆర్ నిర్నయం తీసుకున్నారు.

రేపట్నుంటి సిటీబస్సులు నడుపుతున్నామని రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. 25 శాతం బస్సులు నడిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకారం తెలిపారని ఆయన తెలిపారు. ఇప్పటికే నిన్న నగర శివార్లలోని ఇతర ప్రాంతాలకు కూడా బస్సు సర్వీసులను ప్రారంభించింది తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ. 10శాతం బస్సులు నడపాలా 50 శాతం బస్సులు నడపాలా అన్న అంశం పై కేసీఆర్ తో అధికారులు చర్చలు జరిపారుగ్రేటర్ ఆర్టీసీ అధికారులు ఇటీవల ఇతర రాష్ట్రాల్లో సిటీ బస్సుల తీరుపై అధ్యయనం చేసి ఒక రిపోర్టును సిద్దం చేశారు. దానిని సిఎం ముందించిన అధికారులు ఆయనతో చర్చించి రేపటి నుండి 25 శాతం బస్సులు నడిపేలా నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version