ఈ రోజుల్లో లైంగిక సంబంధాలు మరియు ప్రేమ పేరుతో హత్యలు పెరిగిపోయాయి. రోజూ పేపర్ లో ఏదో ఒక అన్యాయం జరగడం చూస్తూనే ఉన్నాము. ఇక తాజాగా ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ లోని జగద్గిరి గుట్ట లో వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఇక సదరు యువతీ ఎంతకూ ప్రేమను అంగీకరించకపోవడంతో ఆమెను బెదిరించి అయినా లొంగదీసుకోవాలనుకుని వెంట కత్తిని తీసుకెళ్లాడు.. ఆ ఆవేశ క్షణాలలో ఆమెపై కత్తితో దాడి చేశాడు .. మెడపై తీవ్ర గాయాలు అయిన స్థానికులు ఈ సంఘటను చూసి ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ఇక ఈ పరిస్థితితో భయపడిపోయింది నాగరాజు కూడా కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆ యువతీ టీచర్ గా ప్రయివేట్ స్కూల్ లో పని చేస్తుండడం గమనార్హం.