ఈ నెల 11న హైదరాబాద్ లో ఆ మాల్ కి వెళ్ళిన వారు అర్జెంటు గా…!

-

కరోనా వైరస్ సోకిన ఓ వ్యక్తి ఈ నెల 11న హైదరాబాద్‌లోని పంజాగుట్ట నెక్స్ట్ గలేరియా మాల్‌కు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఆ రోజు మాల్‌కు వెళ్లిన ప్రజలకు తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. సెల్ఫ్-క్వారంటైన్‌లో ఉండాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కరోనా బాధితుడు, 11వ తేదీన పంజాగుట్ట మాల్‌ను సందర్శించాడని, కావున ఆ రోజు మాల్‌కు వెళ్లిన వారిలో కరోనా లక్షణాలు ఏమాత్రం కనిపించినా సరే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు..

అదే విధంగా ఇంగ్లండ్ నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చిన 18 ఏళ్ళ యువతికి కరోనా పరీక్షలలో పాజిటివ్ ఫలితాలు వచ్చాయని తెలుస్తుంది. గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన యువతీ ఆమె. ఈ నెల 17-18 తేదీల్లో క్వారంటైన్‌లో ఉన్నారు. వాళ్ల ఇంటి డ్రైవర్, పనిమనిషి ఆ యువతిని కలిసినట్లు అధికారులు గుర్తించారు.

అప్పటికి ఆమెకు వైద్యులు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు ఇంకా రాలేదు. డ్రైవర్, పనిమనిషి మాత్రం మిగతా కుటుంబసభ్యులను కూడా మామూలుగానే కలిశారని సమాచారం. సదరు డ్రైవర్, పనిమనిషి ఎవరెవరిని కలిశారో వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అదే విధంగా విదేశీయుల ఇళ్ళల్లో పని చేసే వారికి కూడా పరిక్షలు నిర్వహించాలని భావించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version