బ్రాహ్మణిని కలిసిన హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు

-

హైదరాబాద్‌లో వివిధ కంపెనీల్లో పని చేస్తోన్న ఐటీ ఉద్యోగులు రాజమండ్రిలో నారా బ్రాహ్మణిని కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఒక విజనరీ లీడర్‌ను జైలులో పెట్టడం చాలా బాధ కలిగిస్తోందని వారు… బ్రాహ్మణితో ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఐటీ రంగ ఉన్నతికి ఎంతో కృషి చేసి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు అరెస్ట్ కక్ష పూరిత చర్య అన్నారు. చంద్రబాబు అరెస్టును ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.

తమకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు, బెదిరింపులు దారుణం అని అన్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనదారుల ఫోన్ లు చెక్ చేయడం, వారి చాట్ లు పరిశీలించడం షాక్ కు గురిచేసింది అన్నారు. పోలీసుల చర్య వ్యక్తి గత గోప్యత హక్కును హరించడమే అన్నారు. సామాన్య ప్రజల ఫోన్ లు చెక్ చేసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. అసలు ఏ కారణంతో, హక్కుతో ఉద్యోగుల రాకపై ఆంక్షలు పెట్టారో చెప్పాలన్నారు. మీకు తెలిసి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు కు సంఘీభావం తెలిపేందుకు అనేక వ్యయ ప్రయాసలు ఓర్చి, ప్రభుత్వ నిర్భందాలను దాటుకుని వచ్చిన ఉద్యోగులను చూసి తాను గర్వ పడుతున్నా అని బ్రాహ్మణి వారికి ధన్యవాదాలు తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version