యాప్‌స్టోర్‌, ప్లే స్టోర్‌కు పోటీగా ఇండస్‌ యాప్‌ స్టోర్‌ను తీసుకొచ్చిన ఫోన్‌ పే

-

ఇప్పటి వరకూ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే మనం ప్లే స్టోర్‌ను మాత్రమే వినియోగించేవాళ్లం. కానీ ఇప్పుడు దేశీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే (PhonePe) ఇండస్ యాప్ స్టోర్ పేరుతో కొత్త వేదిక ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్టోర్‌లో తమ అప్లికేషన్లను లిస్ట్ చేయాలని యాప్ డెవలపర్లను కోరింది. 12 స్థానిక భాషల్లో యాప్ స్టోర్ త్వరలో అందుబాటులోకి రానుందట. యాప్ స్టోర్ల విభాగంలో గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో ఫోన్ పే వాటికి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

ఇండస్‌ యాప్‌ స్టోర్‌

వాల్‌మార్ట్‌ యాజమాన్యంలోని ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ ఫోన్‌పే గూగుల్, యాపిల్ వంటి టెక్ దిగ్గజాలకు షాకిస్తూ మరో కొత్త విభాగంలోకి అడుగుపెట్టడం నిజంగా చాలా గొప్ప ప్రయత్నమనే చెప్పాలి. యాప్‌ డెవలపర్ల కోసం ఇండస్‌ యాప్‌ స్టోర్‌ (Indus Appstore) పేరిట కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో ఫోన్‌పే ఇండస్‌ యాప్‌ స్టోర్‌ (Indus Appstore) తీసుకురావడం విశేషం. ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లు ఈ యాప్ స్టోర్‌లో రిజిస్టర్ చేసుకొని మేడిన్ ఇండియా యాప్స్‌ను ఇండస్ యాప్ స్టోర్‌లో అప్‌లోడ్ చేయొచ్చని ఫోన్‌పే (PhonePe) ప్రకటించింది. https://indusappstore.com/ వెబ్‌సైట్‌ ద్వారా యాప్స్‌ను అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంది. యూజర్లు ఈ-మెయిల్ అకౌంట్ లేకుండానే మొబైల్ నెంబర్ ఆధారంగా లాగిన్ అవ్వొచ్చు. ఈ యాప్ సేవలు 12 భాషల్లో అందుబాటులో ఉండనున్నాయి.

మొదటి ఏడాది డెవలపర్ల నుంచి తాము ఎలాంటి ఫీజూ వసూలు చేయబోమని ఫోన్‌ పే తెలిపింది. మరుసటి ఏడాది నుంచి తక్కువ మొత్తంలో మాత్రమే ఫీజు వసూలు చేస్తామని వెల్లడించింది. యాప్‌ డెవలపర్ల నుంచి ఎలాంటి ప్లాట్‌ఫామ్‌ ఫీజుగానీ, ఇన్‌-యాప్‌ పేమెంట్స్‌కు కమీషన్‌ గానీ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. అలాగే.. తమకు నచ్చిన పేమెంట్‌ గేట్‌వేను ఉచితంగా ఇంటిగ్రేట్‌ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. మార్కెట్‌లో ఉన్న రెండు పెద్ద తలకాయలకు పోటిగా ఫోన్‌పే తెచ్చిన ఈ యాప్‌ సక్సస్‌ అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version