మహమ్మారి వచ్చినప్పటి నుండి సాధారణ జీవితం అందని ద్రాక్షగా మారిపోయింది. పరిస్థితులన్నీ మారిపోయాయి. ఊహకు కూడా అందని దాన్ని నిజ జీవితంలోకి తీసుకువచ్చి ప్రజలందరినీ ఇబ్బందుల పాలు చేసింది. కరోనా మూలంగా బాగా ఇబ్బంది పడ్డ మరో విషయం రవాణా. చాలా రోజుల వరకు హైదరాబాద్ లో బస్సులు కదల్లేదు. రైళ్ళు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే చక్రాలకి పట్టిన తుప్పును కడిగేసుకుంటూ పట్టాల మీదకి ఎక్కుతున్నాయి.
ఐతే అది కూడా అనేక నియమ నిబంధన నడుమ. అంతే కాదు కరోనా మహమ్మారి వల్ల ఎక్కువ జనం వస్తారా? రారా అన్న అనుమానంతో కొద్ది సమయం మాత్రమే రైళ్ళను నడుపుతున్నారు. హైదరాబాద్ మెట్రో చేసిందదే. ఐతే ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు తన సమయాన్ని పెంచింది. ఉదయం 7గంటలకు ప్రారంభమయ్యే రైలు సేవలు, రాత్రి 11:15గంటల వరకు కొనసాగుతాయి. రాత్రి 10:15గంటలకు మొదలయ్యే రైలు చివరి స్టేషన్ చేరుకునేసరికి 11:15గంటలు పడుతుంది. మొత్తానికి రైలు సమయం పెంచడం వల్ల చాలా మందికి లాభిస్తుంది.