న్యూ ఇయర్ ముందు భారీగా పాటుబడుతున్న గంజాయి..!

-

ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు ట్రావెల్ బస్సులో తీసుకువస్తుండగా గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒరిస్సా ప్రాంతానికి చెందినటువంటి అనిల్ కుమార్ అనే వ్యక్తి భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కు కావేరీ ట్రావెల్ బస్సులో గంజాయి చాక్లెట్లను తీసుక వస్తున్న సమాచారం మేరకు కోదాడ రాంపూర్ ఎక్స్ రోడ్ వద్ద ట్రావెల్ను ఎక్సైజ్ పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. ట్రావెల్ బస్సులో 1000 చాక్లెట్లు ఎక్సైజ్ పోలీసులు సిబ్బంది కలిసి పట్టుకున్నారు. ఒరిస్సా కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో ఈ గంజాయి చాక్లెట్లను రూ. 30కి ఒకటి చొప్పున అమ్మకాలు సాగిస్తూ ఈ అనిల్ కుమార్ సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చిన అటువంటి అనిల్ కుమార్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు కోదాడ ఎక్సైజ్ సీఐ శంకర్ పేర్కొన్నారు.

అలాగే హైదరాబాద్ డివిజన్ పరిధిలోని నారాయణగూడ,సికింద్రాబాద్, అమీర్పేట్, చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్ల లో 59 కేసుల్లో పట్టుబడినటువంటి వివిధ రకాల డ్రగ్సు,గంజాయి ని కాల్చివేశారు పోలీసులు. డ్రగ్స్ గంజాయి డిస్పోజల్ అధికారి హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కే ఏ బి శాస్త్రి ఆదేశాల మేరకు ఏ ఈ ఎస్ శ్రీనివాసరావు గంజాయి డ్రగ్స్ ను జి జె మల్టీ క్లౌడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ డ్రగ్స్ ను గంజాయిని దహనం చేశారు. దహనంలో 240 కేజీల గంజాయి, 496 కేజీల ఎండీఎంఏ, ఆశిష్ ఆయిల్, పాపిస్ట ఇతర రకాలైనటువంటి డ్రగ్స్ ని కాల్చివేశారు. కాల్చి వేసిన డ్రగ్స్ విలువ రూ.రెండు కోట్ల మేర ఉంటుందని అంచనా వేశారు. డ్రగ్స్ ను కాల్చివేసినటువంటి హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ టీం లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news