కృష్ణా కూచిపూడి కళాక్షేత్రంలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు జరిగాయి. ఇందులో మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలలో భాగంగా 50 అడుగుల ఏకశిలపై కూచిపూడి నృత్య భంగిమలతో పతాకాన్ని ప్రపంచానికి సమర్పించడం.. అద్భుతం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన మన రాష్ట్రంలో ఆదరణ లేకపోవడం బాధాకరం. కూచిపూడి నృత్యం అజరామంగా విరాజిల్లే విధంగా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది.మనది అని చెప్పుకొని సాంస్కృతిక, సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉంది అన్నారు.
ఇక మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు కళల గురించి ఎప్పుడు మాట్లాడిన… నోటి వెంట ముందుగా వచ్చేది కూచిపూడి గురించే. కూచిపూడి నృత్యాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత జిల్లా వాసిగా నేను తీసుకుంటాను. కూచిపూడి నృత్య కళాకారులను ప్రోత్సహించేలా… ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి అవకాశం కల్పించేలా కార్యాచరణ రూపొందిస్తాం. రాష్ట్రంలోని అన్ని శాఖల సమన్వయంతో, స్థలాలు కేటాయించి కూచిపూడి క్షేత్రాలు ఏర్పాటుతో.. భావితరాలకు కూచిపూడి నృత్యాన్ని చేరువ చేసేందుకు కృషి చేస్తాం అని తెలిపారు..