వచ్చే మూడు రోజుల భారీ వర్షాలు అని ఐఎండి చెప్పిందని కేటీఆర్ అన్నారు. ఇప్పటిదాకా కురిసిన భారీ వర్షాలకు మూడు చెరువులు తెగి భారీ నష్టం జరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వం హై అలర్ట్ లో ఉందన్న ఆయన ఎపి,కర్ణాటక నుంచి బోట్ లు తీసుకువస్తున్నామని అన్నారు. మానవ తప్పిదాలు…ప్రభుత్వ తప్పిదాలు …ప్రకృతి ప్రకోపం ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆయన అన్నారు. చాలా మంది ప్రాణాలు కాపాడగలిగామన్న ఆయన .ప్రాణ నష్టం తగ్గించామని అన్నారు.
వర్షాలపై 80 మంది స్పెషల్ ఆఫీసర్స్ ని నియమించామని 18700 కిట్ లు పంపిణీ చేసామని అన్నారు. శిథలవస్థలలో ఉన్న భవనాలు కూల్చివేస్తున్నమన్న ఆయన ఇంకా 80 కాలనీలు నీళ్లల్లో ఉన్నాయని అన్నారు. కేంద్రం నుంచి ఆర్థిక సహాయం పై స్పందన రాలేదు…సానుకూలంగా వస్తుంది అని ఆశిస్తున్నామన్న ఆయన గ్రేటర్ పరిధిలో 33 మంది చనిపోయారని ముగ్గురు మిస్ అయ్యారని అన్నారు. ఇక ఈరోజు కూడా మొన్నటికి మించి వర్షం పడే అవకాశం ఉందన్న ఆయన లోతట్టు ప్రాంతాల ప్రజలు లైఫ్ ను రిస్క్ లో పెట్టుకోవద్దని, పై ఫ్లోర్ లలో ఉన్న వాళ్ళు సహాయ కేంద్రాలకు రావాలని కోరారు.