హైదరాబాద్‌లో వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం.. ఎక్కడెక్కడ ఎంతెంత అంటే ?

-

హైదరాబాద్ మహా నగరం నీటమునిగింది. 32 సెంటీ మీటీర్ల భారీ వర్షానికి ఊరూ వాడా ఏకమయ్యాయి. అయితే హైదరాబాద్‌ లో వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం నమోదయినట్టు లెక్కలు చెబుతున్నాయి. నిన్నటి దెబ్బకు హైదరబాద్ లోని వివిధ ప్రాంతాల్లో నమోదయిన వర్షపాతం ఇలా ఉంది. ఘట్‌ కేసర్‌-32 సెం.మీల వర్షపాతం నమోదయింది. ఇదే హయ్యెస్ట్, ఇక ఆ తరువాత హయత్‌నగర్‌ లో- 29.8 సెం.మీ వర్షపాతం, హస్తినాపురంలో -28.4 సెం.మీ, సరూర్‌నగర్‌ లో – 27.3 సెం.మీ వర్షపాతం, అబ్దుల్లాపూర్‌ మెట్‌ లో -26.6 సెం.మీ, కీసరలో- 26.3 సెం.మీ వర్షపాతం నమోదయింది.

ఇబ్రహీంపట్నంలో- 25.7 సెం.మీ, ఓయూలో-25.6 సెం.మీ వర్షపాతం, ఉప్పల్‌ లో- 25.6 సెం.మీ, మేడిపల్లిలో-24.2 సెం.మీ వర్షపాతం, కందికల్‌గేట్‌ లో -23.9 సెం.మీ, రామంతాపూర్‌ లో 23.2 సెం.మీ వర్షపాతం, బేగంపేట్‌ లో -23.2 సెం.మీ, మల్కాజ్‌గిరి లో-22.6 సెం.మీ వర్షపాతం, అల్వాల్‌ 22.1 సెం.మీ, ఆసిఫ్‌నగర్‌, సైదాబాద్‌లో 20 సెం.మీ వర్షపాతం, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌ లో 20 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version