హైదరాబాద్ నుండి అండమాన్ టూర్ ప్యాకేజీ.. ఇవన్నీ చూసి వచ్చేయచ్చు..!

-

మంచి టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే అండమాన్ టూర్ ప్యాకేజీని చూసేయండి. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుండి అండమాన్ కి ఓ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. ఇక దీని గురించి పూర్తి వివరాలు చూసేద్దాం. అమేజింగ్ అండమాన్ పేరు తో హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ని IRCTC ఆపరేట్ చేస్తోంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హేవ్‌లాక్, పోర్ట్‌బ్లెయిర్‌లోని పర్యాటక ప్రాంతాలు ఈ ప్యాకేజీ లో కవర్ అవుతాయి. 2023 ఆగస్ట్ 18న ఈ టూర్ మొదలు కానుంది. మొదటి రోజు హైదరాబాద్‌లో ఈ టూర్ ప్రారంభం అవుతుంది.

తెల్లవారుజామున 5.35 గంటలకు హైదరాబాద్‌లో విమానం ఎక్కితే మధ్యాహ్నం 1.10 గంటలకు పోర్ట్‌బ్లెయిర్ రీచ్ అవుతారు. అక్కడే ఉండాలి. ఆ తరవాత కార్బిన్స్ కోవ్ బీచ్ చూడొచ్చు. సెల్యులార్ జెయిల్ కూడా చూడవచ్చు. రాత్రికి పోర్ట్‌బ్లెయిర్‌లో స్టే చెయ్యాలి. అలానే రెండో రోజు రాస్ ఐల్యాండ్, నార్త్ బే ఐల్యాండ్ చూడవచ్చు. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. స్క్యూబా డైవింగ్, గ్లాస్ బాటమ్ బోట్ రైడ్ కూడా ఉంటుంది.

మూడో రోజు హేవ్‌లాక్ టూర్. క్రూజ్ ద్వారా హెవ్‌‌లాక్ వెళ్ళాలి. ఆ తర్వాత కాలాపత్తర్, రాధానగర్ బీచ్ కి వెళ్లి రావచ్చు. రాత్రికి హేవ్‌లాక్‌లో ఉండాలి. నాలుగో రోజు నీల్ ఐల్యాండ్‌కు క్రూజ్‌లో వెళ్ళాలి. భరత్‌పూర్ బీచ్, నేచురల్ బ్రిడ్జి, లక్ష్మణ్ బీచ్ ని కూడా చూడొచ్చు. ఐదో రోజు పోర్ట్ బ్లెయిర్‌కు క్రూజ్‌లో వెళ్ళాలి. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో ఉండాలి. ఆరో రోజు తిరుగు ప్రయాణం మొదలు. రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్ వచ్చేస్తారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.45,540, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.45,830, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.58,440 పే చెయ్యాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version