IRCTC సూపర్ ప్యాకేజీ… హైదరాబాద్ నుండి షిమ్లా, మనాలీ టూర్..!

-

చాలా మంది వేసవిలో చల్లటి ప్రదేశాలని చూడాలని చాలా మంది అనుకుంటూ వుంటారు.
మీరు కూడా వేసవి లో ఏదైనా చల్లటి ప్రదేశాలని చూడాలనుకుంటున్నారా..? అయితే IRCTC అందిస్తున్న ఈ ప్యాకేజీని చూడాల్సిందే. ఈ ప్యాకేజీ ద్వారా మీరు ఎంచక్కా హైదరాబాద్ నుండి ఈ ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు. హ్యాపీ హిమాచల్ పేరు తో హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చారు. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

ఏప్రిల్ 18న ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా షిమ్లా, మనాలీ, చండీగఢ్ వంటివి చూసి వచ్చేయచ్చు. ఇక ఈ టూర్ వివరాలని చూస్తే.. షిమ్లా, మనాలీ టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో మొదలు అవుతుంది. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో ఫ్లైట్. మధ్యాహ్నం 12.30 గంటలకు చండీగఢ్ రీచ్ అవుతారు.

అక్కడ నుండి షిమ్లా బయల్దేరాలి. సాయంత్రం మాల్ రోడ్ వెళ్ళచ్చు. రాత్రికి షిమ్లాలోనే స్టే చెయ్యాల్సి వుంది. మూడో రోజు షిమ్లా నుంచి మనాలీ స్టార్ట్ అవ్వాలి. రాత్రికి మనాలీలోనే స్టే చెయ్యాలి. నాలుగో రోజు మనాలీ సైట్ సీయింగ్ వుంది. ఐదో రోజు మనాలీ లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. రాత్రికి అక్కడే వుంది. ఆరో రోజు మనాలీ నుంచి చండీగఢ్ స్టార్ట్ అవ్వాలి. రాత్రికి చండీగఢ్‌లో ఉండాలి.

ఏడో రోజు రాక్ గార్డెన్ కి వెళ్ళచ్చు. సాయంత్రం 4.35 గంటలకు చండీగఢ్‌లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 7.05 గంటలకు హైదరాబాద్ రీచ్ అవుతారు. ఇక ధర విషయానికి వస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.42,300, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.44,200, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.58,550 చెల్లించాలి. పూర్తి వివరాలని అధికారిక వెబ్ సైట్ లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version