మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల ఘనంగా ప్రారంభమయ్యాయి. 2020 జూన్ 28న ప్రారంభమయ్యే శత జయంతి ఉత్సవాలు… 2021 జూన్ 28 వరకూ కొనసాగనున్నాయి. కాగా, హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పీవీ జ్ఞాన భూమి వద్ద జరిగిన శత జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటనలు చేశారు.
హైదరాబాద్ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రధానికి కూడా తాను ఈ రోజే లేఖ రాస్తానని వెల్లడించారు. అలాగే తెలుగు అకాడమీకి పీవీ నరసింహారావు పేరు పెడతామన్నారు. ఇంకా కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు పీవీ పేరు పెట్టాలని అనుకుంటున్నామని కేసీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్‌తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వేదిక వద్దకు చేరుకోవడం విశేషం. ఈ కార్యక్రమానికి పీవీ కుటుంబ సభ్యులు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.