హైద‌రాబాద్‌లో 15వేల కోట్ల పెట్టుబ‌డితో మైక్రోసాఫ్ట్ డేటాసెంట‌ర్‌

-

హైదరాబాద్‌లో మరో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతోంది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తామని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ ప్రకటించారు.
2025 నాటికి తొలిదశ ప్రారంభం అవుతుందని తెలిపారు.

తర్వాత దశలవారీగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ మేర‌కు తెలంగాణ ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో మైక్రోసాఫ్ట్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ డేటా సెంటర్ కోసం మైక్రోసాఫ్ట్‌ సంస్థ రూ.15వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. కాగా మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసే ఈ డేటా సెంటర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అమెరికాలోని రేమండ్‌లో ఉన్న డేటా సెంటర్ కంటే పెద్దది అవుతుంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌కి పుణె, ముంబై, చెన్నైలలో డేటా సెంటర్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ కంపెనీ కి అన్ని విధాలా అండగా ఉంటుందని వివరించారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version