లాక్ డౌన్ లో వాహనాలు సీజ్ చేస్తే లాక్ డౌన్ తర్వాతే అప్పగింత: హైదరాబాద్ పోలీసులు

-

తెలంగాణాలో లాక్ డౌన్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ పై పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీజ్ చేసిన వాహనాల ను లాక్ డౌన్ పూర్తి అయ్యాకే అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. సీజ్ చేసిన వాహనాల పార్కింగ్ కోసం నగరం లో ఫంక్షన్ హాల్స్ ని పోలీస్ శాఖ సిద్దం చేసింది. సీజ్డ్ వాహనాలను ఫంక్షన్ హాల్స్ కి పంపిస్తున్న పోలీస్ లు… లాక్ డౌన్ తర్వాతే ఇస్తామని స్పష్టం చేస్తున్నారు.

చెకింగ్ పాయింట్స్ వద్ద న్యూసెన్స్ చేసే వ్యక్తుల మీద కేసులు నమోదు చేస్తున్నారు. హైదరాబద్ లో భారీగా వాహనాలు సీజ్ చేస్తున్నారు. రోడ్ల పైకి వస్తున్న వాహనదారుల పై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. సెంట్రల్ జోన్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ పబ్లిక్ సిల్లీ రీజన్స్ చెప్తున్నారు అని అన్నారు. అరకిలో టమాటా కి..అరకిలో బీరకాయలు రోడ్ల మీదకు వస్తె ఎలా అని ప్రశ్నించారు. పబ్లిక్ కి లాక్ డౌన్ పై భాధ్యత లేకుండా పోయింది అన్నారు. ఖాళీ సమయాల్లో రోడ్ల మీదకు రావడం ఫ్యాషన్ అయ్యిందని నైట్ వేర్స్ వేసుకొని ప్రభుత్వ ఉద్యోగి అని చెప్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version