బలమైన కండరాలను పొందాలనుకుంటున్నారా? అయితే ఇన్ని గ్రాముల ప్రోటీన్ ను తీసుకోవాల్సిందే..!

-

పూర్తి ఆరోగ్యం కోసం ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ తో పాటుగా ప్రోటీన్ కూడా ఎంతో అవసరం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రోటీన్ చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సహజంగా జిమ్ కు వెళ్లేవారు ఎక్కువగా ప్రోటీన్‌ను తీసుకుంటారు, కాకపోతే వారికి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ప్రోటీన్ అనేది ఎంతో కీలకమైన ఆహారం అనే చెప్పవచ్చు. కండరాల బలహీనతను ఎదుర్కోకుండా ఉండాలంటే తప్పకుండా ప్రోటీన్ తీసుకోవాలి. అంతేకాకుండా శరీరం ఎదుగుదలకు కూడా ప్రోటీన్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. చిన్న వయసు వారికి కూడా ప్రోటీన్ చాలా అవసరం.

ముఖ్యంగా వారు ఎదిగే వయసులో కండరాల ఎదుగుదలకు ప్రోటీన్ ఎంతో ముఖ్యం. అందువలన శిశువులకు రోజుకు 8 నుండి 10.5 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. చిన్నపిల్లలకు 11.3 గ్రాములు, నాలుగు నుండి ఆరేళ్ల వయసు గల వారికి 16 గ్రాములు మరియు వారు పెద్దయ్యే వరకు రోజుకు 34 గ్రాముల ప్రోటీన్ చాలా అవసరం. అయితే యువతి, యువకులు యుక్త వయసులో ఉండేటువంటి వారికి, మగవారైతే 52 గ్రాములు, ఆడవారైతే 46 గ్రాములు ప్రోటీన్ కచ్చితంగా తీసుకోవాలి. ప్రతిరోజు ఆహారంలో భాగంగా పప్పు దినుసులు, పన్నీర్, పెరుగు, గుడ్లు, చికెన్ వంటి ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి.

ఎప్పుడైతే ఆహారంలో మార్పులను చేసుకుంటారో, ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. వయసు పెరిగే కొద్దీ కండరాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్యలను నివారించడానికి ప్రోటీన్ ఎంతో అవసరం. కనుక రోజుకు 60 నుండి 70 గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకోవాలి. అయితే వయసు పెరిగినప్పుడు జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. కనుక ప్రోటీన్ కోసం తేలికగా జీర్ణం అయ్యే కిచిడి, పెరుగు, పన్నీరు వంటి ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవడం మేలు.

Read more RELATED
Recommended to you

Latest news