సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. దాంట్లో భాగంగా అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్నప్పుడు చర్మానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు పాటిస్తే తేమగా ఉంటుంది. లేకపోతే పొడిగా మారుతుంది. ప్రస్తుతం చర్మ సంరక్షణలో భాగంగా ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
సన్ స్క్రీన్
చాలామంది బయటకు వెళ్ళినపుడు మాత్రమే సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవాలని అనుకుంటారు. కాని ది తప్పు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ పెట్టుకోవడం ఉత్తమం. ఫోన్లు, కంప్యూటర్లు ఎక్కువగా వాడతారు కాబట్టి దాన్నుండి వచ్చే నీలికాంతి నుండి కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్ వాడడం తప్పనిసరి.
ఫేస్ మాస్క్
కరోనా నుండి రక్షణ పొందడానికి మాస్క్ ఎలా ఉపయోగిస్తున్నారో, అలాగే చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి మాస్క్ వాడాలి. వేసవిలో పెరుగుతో చేసిన ఫేస్ మాస్క్ బాగా పనిచేస్తుంది. ఒక చెంచా ఓట్స్ తీసుకుని, దానికి రెండు స్పూన్ల పెరుగు కలిపి ముఖానికి మర్దన చేయాలి. 15నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి. దీనివల్ల చర్మం తేమగా మారడంతో పాటు సురక్షితంగా ఉంటుంది.
హెయిర్ డ్రై వాడవద్దు.
జుట్టుని ఆరబెట్టడానికి హెయిర్ డ్రయర్ వాడవద్దు. దానివల్ల జుట్టుకి హాని కలుగుతుంది. ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి హాయిగా ఆరబెట్టుకోండి. హెయిర్ డ్రయర్ అస్సలు వాడవద్దు.
స్నానం
స్నానం చేయడం వల్ల విశ్రాంత ఫీలింగ్ కలుగుతుంది. రోజంతా పని చేస్తూ అలసిపోయిన మీకు స్నానం చేయడం వల్ల కొత్త శక్తి వస్తుంది. మానసికంగా ఉత్తేజం ఉరకలు వేస్తుంది. మనసు ఉల్లాసంగా ఉంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.